పెరుగు అన్నం vs లెమన్‌ రైస్‌: ఈ సమ్మర్‌లో ఏది మంచిదంటే.. | Curd Rice vs Lemon Rice: Which Keeps Your Blood Sugar More Stable | Sakshi
Sakshi News home page

పెరుగు అన్నం vs లెమన్‌ రైస్‌: ఈ సమ్మర్‌లో డయాబెటిస్‌ రోగులకు ఏది మంచిదంటే..

Apr 25 2026 1:23 PM | Updated on Apr 25 2026 1:42 PM

Curd Rice vs Lemon Rice: Which Keeps Your Blood Sugar More Stable

డయబెటిస్‌ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా మితంగా అన్నం తినడమే మేలు అని వైద్యులు సూచిస్తుంటారు. అందులోనూ మన భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉండే రైస్‌ని తక్కువగా, కూర ఎక్కువగా కలుపుకుని తినమని చెబుతుంటారు. పైగా ఇలాంటి హాట్‌ సమ్మర్‌లో ప్రజలంతా తేలికపాటి వంటకాల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా పెరుగన్నం, నిమ్మకాయ పులిహార వంటి తేలికపాటి వంటకాలనే తరుచుగా చేసుకుంటారు. మరి రైస్‌ కంటెంట్‌ తక్కువగా తీసుకోవాల్సిన మధుమేహ రోగులకు మరి ఇవి మంచివేనా అంటే..

మరి ఈ రెండు వంటకాలలోని పోషక విలువలు వేరువేరుగా పరిశీలించి ఏది తీసుకోవడం మంచిదో పోషకాహార నిపుణులు మాటల్లో తెలుసుకుందామా..!.

అన్నం తింటే చక్కెర స్థాయిలు పెరగడానికి రీజన్‌..
రైస్‌ రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతుందంటే..శుద్ధి చేసిన తెల్ల బియ్యం రకాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంటుందని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, కాబట్టి వైద్యులు డయాబెటిస్‌ పేషెంట్లను అన్నం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంటారు.

పెరుగు అన్నం..
పెరుగు, అన్నంతో పాటు రకరకాల మసాలాలు, కరివేపాకు కలిపి తయారు చేస్తారు. ఇది రుచిని జోడించడమే కాకుండా,  రక్తంలో చక్కెరను పెంచే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. వేడి తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇది చాలా అనువైనది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకునే పోషకమైన ఆహారం.

దీని తయారీలో సాదా అన్నాన్ని పెరుగుతో కలుపుతారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి.  ఇది కార్బోహైడ్రేట్ల శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అన్నంలో పెరుగు కలపడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వంపై దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ఇది మెదడుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్‌, మెరుగైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వేసవి వేడికి చక్కటి ఉపశమనం కూడా. అలాగే గ్లూకోజ్‌ ప్రతిస్పందనను స్థిరీకరిస్తుంది కూడా. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఇది బెస్ట్‌ ఆహారం.

నిమ్మకాయ పులిహోర(లెమన్‌ రైస్‌)
ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది, అందువల్ల ఇది ఇతర వేసవి ఆహారాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని తయారీకి ఉపయోగించే నూనె, వేరుశెనగలు మరియు ఆవాలు కలపడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత మెరుగుపడుతుంది.

ఏది మంచిదంటే..

పెరుగు అన్నం సాధారణంగా భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, కాబట్టి దానిని ఎలా తీసుకుంటే మంచిదనే దానిపై అవగాహన అవసరం.  నియంత్రించుకోవడం అవసరం.

నిమ్మకాయ అన్నం  ఇందులో ఉపయోగించే నూనె పరిమాణంపై ఆధారపడి ఉంటుంది , అలాగే తినే పరిమాణం కూడా అత్యంత ముఖ్యం.

రోజులోని సమయం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగతంగా గ్లూకోజ్ తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆ రెండింటిని తీసుకునే పరిమాణం అనేది అత్యంత ప్రధానం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.  

తీపిలేని పెరుగు, మిగతా కూరగాయలు జోడించి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. 

ఇక నిమ్మకాయ పులిహోరలో వేరుశెనగలు తక్కువగా వేసుకుంటూ..మిగతా కూరగాయలు జోడిస్తే ఇది కూడా మధుమేహ రోగులకు మంచి బలవర్ధకమైన ఆహరమే అవుతుంది. 

ఇవి రెండూ కూడా డయాబెటిస్‌ రోగులకు మంచివే గానీ చేసే విధానం, పరిమాణం వంటి ఆధారంగానే  మంచి ప్రయోజనాలను పొందగలరని వైద్యులు చెబుతున్నారు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..)
 

Advertisement
 
Advertisement
Advertisement