'లీక్‌ బాధ్యులను కఠినంగా శిక్షించాలి' | EAMCET-2 paper leaked: Telangana CID | Sakshi
Sakshi News home page

'లీక్‌ బాధ్యులను కఠినంగా శిక్షించాలి'

Jul 28 2016 12:26 PM | Updated on Sep 4 2017 6:46 AM

ఎంసెట్-2 లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

యాదగిరిగుట్ట : తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు చేసిన తప్పుకు మిగిలిన విద్యార్థులను బాధ్యులను చేసేలా ఎంసెట్‌ను రద్దు చేయడం తగదన్నారు. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement