సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..
‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్‌ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


