జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గత నెల 28 నుంచి చేపట్టింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ నుంచి వర్చువల్‌గా ప్రధానమంత్రి మోదీ, హైదరాబాద్ కింగ్‌కోఠి ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ టీకాను గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయడానికి రూపొందించారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని బాలికల ఆరోగ్య సంరక్షణకు ఇది ముఖ్యమని వైద్యాధికారులు చెబుతున్నారు.
టీకా ప్రాముఖ్యం ఇదే..
హెచ్‌పీవీ అంటువ్యాధి కారణంగా ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ కణజాలం సహా ఇతర యోనిరహిత కణజాలాల వద్ద క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేస్తుంది. క్యాన్సర్‌ను నివారించేందుకు ముందస్తుగా ఈ టీకా వేస్తారు. వ్యాక్సిన్ వైరస్ రాకముందే అందించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే కేంద్రం 14 నుంచి15 సంవత్సరాల బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేయించుకోవచ్చు. హెచ్‌పీవీ టీకా పక్కనే క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే కనుక్కునేందుకు చేసే పాప్ స్మెర్ పరీక్షలు వంటి ఇతర నివారణ చర్యలతో మహిళల ఆరోగ్య రక్షణను బలోపేతం చేస్తుంది.
కార్యక్రమం విధానం..
ప్రోగ్రాంలో బాలికలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఒకేసారి గార్డాసిల్–4 టీకా తీస్తారు. ఇది హెచ్‌పీవీ రోగానికి ముఖ్యమైన రకాలైన 16, 18 వంటి రకాలపై రక్షణ ఇస్తుంది. ఈ టీకా కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి సంవత్సరం 14 ఏళ్ల బాలికలను టీకా ద్వారా రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు సంబంధించిన క్యాన్సర్ రుగ్మతను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
జిల్లాలో 5,674 మంది బాలికలు
జిల్లాలో 16 పీహెచ్‌సీల పరిధిలో 14 ఏళ్లలోపు బాలికలు 5,674 మంది ఉన్నట్లు ఆశా, అంగన్‌వాడీ, లింక్ వర్కర్ల సర్వేలో వెల్లడైంది. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఇమ్యునైజేషన్ అధికారి పర్యవేక్షణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఇంటింటికీ చేపట్టిన సర్వేలో 14 ఏళ్ల లోపు బాలికల సంఖ్యపై ప్రత్యేక గణన పూర్తయ్యింది. జిల్లాలో ఏఎన్‌ఎంలు 161, ఆశలు 507, అంగన్‌వాడీలు 695, లింకు వర్కర్లు 78 మంది ఉన్నారు. జనాభా ఎస్‌హెచ్‌జీ లెక్కల ప్రకారం అంచనా వేసిన ఒక శాతంతో 14 ఏళ్లలోపు బాలికలు 5,395 మంది ఉండాలి. అయితే వాస్తవ సర్వేలో అంచనా లెక్కల కంటే ఎక్కువగా బాలికలు 5,674 మంది ఉన్నట్లు గుర్తించారు.
పీహెచ్‌సీ బాలికలు
ఓబుల్‌కేశ్వాపూర్ 139
లిం.ఘణపురం 285
నర్మెట్ట 287
రఘునాథపల్లి 403
దేవరుప్పుల 204
బచ్చన్నపేట 274
జనగామ
అర్బన్ పీహెచ్‌సీ 1,151
పీహెచ్‌సీ బాలికలు
స్టే.ఘన్‌పూర్ 220
తాటికొండ 65
ఇప్పగూడెం 54
మల్కపూర్ 258
జఫర్‌గఢ్ 438
కూనూర్ 130
పాలకుర్తి 1,194
కొడకండ్ల 421
కోమల్ల 151


