ఆయా.. హోలీ | - | Sakshi
Sakshi News home page

ఆయా.. హోలీ

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

నేడు రంగులపండుగ

ఊరూ..వాడా ఉత్సాహంగా కామదహనం

జనగామ: హోలీ పండగకు జిల్లా సిద్ధమైంది. హోలీ రంగుల అమ్మకాలకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. యువత, పిల్లలు రంగులను కొనుగోలు చేసి ఆటకు సిద్ధమయ్యారు. హోలీ పండగ(మంగళవారం) రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉండడంతో, వేద పండితులు రాష్ట్ర ప్రజలకు ముఖ్య సూచనలు చేస్తున్నారు. గ్రహణం ప్రారంభం కాకముందే పూజలు, హోలీ సంబరాలను పూర్తి చేసుకోవాలని, గ్రహణ కాలంలో ఏ విధమైన శుభకార్యాలు చేయరాదని జనగామ వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణం, హోలీ కలిసివచ్చిన ఈ సంవత్సరం, పూజా సంప్రదాయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సంతోషీమాత ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు.

కామ దహనాలు..

పట్టణంలో సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని వాడవాడల్లో కామ దహనాలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement