మా భూమిలో 60 ఏళ్లుగా మా వంశీకులు చనిపోతే గోరీలు నిర్మించుకుంటూ వస్తున్నాం. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు వచ్చి భూమి తమదంటూ మా పూర్వీకుల గోరీలను కూలగొట్టి ఆ ప్రదేశాన్ని ఆక్రమించారు. ఈ పరిస్థితిని వివరించేందుకు దరఖాస్తుతో కలెక్టర్ సార్‌ను కలిసి మా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చాం. నా మోచేతి వాపును చూసిన కలెక్టర్ నన్ను ఏమైందని అడిగారు. తేలు కరిచిందని, నొప్పితో పాటు జ్వరం కూడా ఉందని చెప్పితే వెంటనే అక్కడున్న సిబ్బందిని పిలిచి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. వారు హాస్పిటల్ తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలుచేసి, గోలీలు ఇచ్చారు. మా సమస్యను వినడమే కాకుండా మా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిన సార్‌కు కృతజ్ఞతలు.
– చెరుకు సోమనరసయ్య, కొడకండ్ల


