జనగామ: వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు.. జిల్లాలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతం చేయాలని రాహుల్ సూచించినట్లు ధన్వంతి తెలిపారు.
ముగిసిన బుగులు
వెంకన్న బ్రహ్మోత్సవాలు
చిల్పూరు: వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం, బలి హరణం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 10 గంటలకు స్వామి వారి చక్రస్నానం భక్తుల సమక్షంలో నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న–విష్వక్సేన, చైర్మన్ శ్రీధర్‌రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సదరం క్యాంపునకు హాజరుకావాలి
జనగామ రూరల్: మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాల దివ్యాంగులు కొత్త, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నంబర్‌కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరంలో 6,9,11,12,13, 18,24,25,26,30వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికి డి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు ఉంటాయన్నారు. కొత్తవి 292 ఉండగా, రెన్యూవల్ 136 ఉన్నాయని మొత్తంగా 428 మందికి అవకాశం ఉన్నదన్నారు. ఫోన్‌కు మెసేజ్ వచ్చినవారు డాక్టర్ రిపోర్టులతో ఆధార్ కార్డు ఫొటో, మీసేవ రశీదుతో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరు కావాలన్నారు.
భలే భలే బార్న్ గుడ్లగూబ
జనగామ: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అరుదైన జాతికి చెందిన ఒక బార్న్ గుడ్లగూబ(శాసీ్త్రయ నామం టైటో ఆల్బా)ను సోమవారం పట్టుకున్నారు. గుండె ఆకారంలో తెల్లటి ముఖం, బంగారు, తెలుపు రంగుల మిశ్రమంతో కనిపించే ఈ గుడ్లగూబ అరుదుగా కనిపిస్తుంది. దీనిని శ్వేత గుడ్లగూబ అనికూడా పిలుస్తారని అంటున్నారు. దాని శబ్దం చాలా విచిత్రంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఎస్‌బీ కానిస్టేబుల్ సోమలింగయ్య, అతడి స్నేహితులు భిక్షపతి, కుమారస్వామి, శంకర్ కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అస్వస్థతతో రోడ్డుపై కనిపించింది. వెంటనే ఓ డబ్బాలో వేసుకుని జనగామ పోలీస్‌స్టేషన్‌లోని కానిస్టేబుల్ సోమనారాయణకు అప్పగించారు. ఆయన వెంటనే సీఐ సత్యనారాయణరెడ్డికి సమాచారం అందించగా, అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. సెక్షన్ ఆఫీసర్ రవీందర్ వచ్చి గుడ్లగూబను తీసుకెళ్లారు. బార్న్ గుడ్లగూబను చూసేందుకు పోలీస్టేషన్ సమీప ప్రజలు ఆసక్తి కనబరిచారు.
02జెజిఎన్062:అరుదైన గుడ్లగూబను అటవీశాఖకు అప్పగిస్తున్న పోలీసులు
02జెజిఎన్,64:వింత ఆకారంలో బార్న్ గుడ్లగూబ


