రోడ్డు ఇక విశాలం.. | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఇక విశాలం..

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

జనగామ: పట్టణంలోని కృష్ణ కళామందిర్‌ గల్లీలో వ్యాపార సంస్థల యజమానులు రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. ‘రోడ్డెక్కిన హోర్డింగ్‌లు’ శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మధ్యన ఉన్న మూడు భారీ హోర్డింగ్‌లతో పాటు చిన్న చిన్న ప్రచార బోర్డులను తీసి వేయించారు. ఈ విషయమై జీఎంఆర్‌ కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, అప్పటికే తొలగించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దారిలో రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో బాటసారులు, వాహనా చోదకులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement