సాక్షి హైదరాబాద్: ఇమ్మడి రవి అలియాస్ (ఐబొమ్మ రవి) కన్ఫెషన్ రిపోర్టులో (నేరాంగీకారం) కీలక విషయాలు వెలుగు చూశాయి. కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం రవిది మెుదటి నుండి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి గుర్తింపుకార్డుతో పలు మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు.
రవి తన భార్యా, పిల్లలను సైతం చిత్రహింసలు పెట్టేవాడని.. అతని ప్రవర్తన నచ్చకే భార్య అతనికి విడాకులు ఇచ్చిందని అన్నారు. రవి భార్యను విచారిస్తే ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు.
పోస్టర్ డిజైన్ చేసినందుకుగాను అతని స్నేహితుడు నిఖిల్‌కు ప్రతినెలా రూ. 50 వేలు ఇచ్చేవాడని తెలిపారు. ఐ బొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవన్నారు. ఇదిలా ఉంటే.. సినీ పైరసీ కేసులో అరెస్టైన రవికి నేటితో ఐదు రోజుల కస్టడీ పూర్తి కావడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


