సాక్షి హైదరాబాద్: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది. కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ సినీ పైరసీ ఐబొమ్మ రవి ఒక్కడే చేశాడని అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని విచారణలో పోలీసులు గుర్తించారు.
కాగా, రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వకేట్ సీవీ శ్రీనాథ్ . రవి ఐదు రోజుల కస్టడీ రెండు రోజుల క్రితం ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడా జైలుకు తరలించారు. అయితే రవికి బెయిల్ వస్తుందని ఆయన తరుఫు లాయర్ శ్రీనాథ్ భావించినప్పటికీ, మరో 14 రోజుల పాటుజ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.
ఇదిలా ఉంచితే, వీటితో పాటు రవిపై పోలీసులు మరో మూడుకేసుల్లో పీటీ వారెంట్ జ్యారీ చేశారు. ఈ వారెంట్లపై విచారించిన కోర్టు రవి కస్టడీ పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.


