హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్‌పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు.



