ఐబొమ్మ వెబ్‌సైట్ పేరుతో సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరిన అతన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని అరెస్ట్‌పై నేడు 11 గంటలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇమ్మడి రవికి సంబంధించిన నెట్‌వర్క్ గురించి ఆయన వివరాలు వెళ్లడించనున్నారు.
సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో టాలీవుడ్ సినీ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొననున్నారు. ఐబొమ్మ వెబ్సైట్‌ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్‌లు ప్రమోట్ చేసి కోట్లు సంపాదించిన రవిపై 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నాంపల్లి న్యాయస్థానం ఇతడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ఐబొమ్మ సహా 65 వెబ్‌సైట్లను పోలీసులు మూసేయించారు.


