 
													మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా డీప్ ఫేక్ ఫోటోల విషయంపై స్పందించారు. కొద్దిరోజుల క్రితం తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారని సీపీ వీసీ సజ్జనార్‌కు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీప్ ఫెక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు మీడియాతో చిరు చెప్పారు.
డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ ఫోటోల విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారని చిరు ఇలా చెప్పారు. 'ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షస్తున్నారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారు. ఎవరూ డీప్ ఫెక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందరం ఆహ్వానించాలి. కానీ, దాని వల్ల ముప్పు కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుంది.' అని చిరంజీవి అన్నారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
