'వారణాసి' ఈవెంట్.. తట్టుకోలేకపోయిన మహేశ్ అభిమాని | Mahesh Varanasi Event And Fan Paid Car Challan | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌పై 'చలాన్' అంత అభిమానం

Nov 16 2025 9:28 PM | Updated on Nov 16 2025 9:28 PM

Mahesh Varanasi Event And Fan Paid Car Challan

మహేశ్ బాబు హీరోగా కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మూడున్నర నిమిషాల గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మహేశ్ ఫ్యాన్ చేసిన మరో పని కూడా చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ శివారులో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం మహేశ్ కారులో వస్తున్న వీడియోని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కారు నంబర్‌తో చెక్ చేయగా.. రెండు చలాన్లు ఉన్నట్లు తేలింది. మహేశ్ బాబు లాంటి హీరో కారుపై చలాన్లు ఉండటంతో ఈ విషయం టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఓ అభిమాని.. మహేశ్ కారుపై చలాన్ల డబ్బుని కట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?)

మహేశ్ బాబు వ్యక్తిగత కారుపై ఉన్న రూ.2070 చలాన్‌ని ఓ ఫ్యాన్ స్వయంగా చెల్లించడం చూసిన పలువురు నెటిజన్లు.. ఇదెక్కడి అభిమానం బాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు.

'వారణాసి' సినిమా విషయానికొస్తే ఇందులో మహేశ్ బాబు, రాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ లుక్‌తో 60 రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు గ్లింప్స్ వీడియో బట్టి చూస్తే గతం నుంచి వర్తమానం, భవిష్యత్ కాలాలన్నింటిని మిక్స్ చేస్తూ ఫాంటసీ స్టోరీతీ దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 వేసవిలో రిలీజ్ కానుందని కీరవాణి చెప్పారు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్‌ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్‌ క్రేజీ రికార్డ్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement