రామ్ చరణ్‌ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్‌ క్రేజీ రికార్డ్! | ram charan latest Movie Peddi chikiri chikiri song record | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్‌ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్‌ క్రేజీ రికార్డ్!

Nov 16 2025 7:14 PM | Updated on Nov 16 2025 7:22 PM

ram charan latest Movie Peddi chikiri chikiri song record

రామ్‌చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ  పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. 

తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్‌ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు  బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement