ఓటీటీలో టాలీవుడ్‌ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్ | Tollywood Crime Thiller Web Series streaming date announced | Sakshi
Sakshi News home page

OTT Web Series: ఓటీటీకి తెలుగు ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్ సిరీస్.. ఎక్కడ చూడాలంటే?

Nov 20 2025 5:09 PM | Updated on Nov 20 2025 5:25 PM

Tollywood Crime Thiller Web Series streaming date announced

ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. టాలీవుడ్‌లో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌. ఈ వెబ్ సిరీస్‌కు జస్విని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు.  

ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ సిరీస్‌ వచ్చేనెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలిపారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌లో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్‌ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే ధూల్ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement