ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆడియన్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలైనా ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మలయాళ క్రైమ్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందులో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సినిమాలతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.
తాజాగా ఓ సీరియల్ కిల్లర్ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. స్టీఫెన్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ సరికొత్త సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 5నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
కాగా.. ఈ చిత్రంలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని రివీల్ చేసింది. ఈ సినిమాకు మిథున్ దర్శకత్వం వహించగా.. జేఎం ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కించారు.
If we have a serial killer on our hands, namma keka vendiya kelvi yaaru nu ah illa yen nu ah?
Watch Stephen, out 5 December in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix! #StephenOnNetflix pic.twitter.com/KHUg70WCrS— Netflix India South (@Netflix_INSouth) November 20, 2025


