ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మూడో పెళ్లి చేసుకున్న భామ.. మరోసారి విడాకులు తీసుకుంది. దీంతో మీనా వాసుదేవన్ పేరు మాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
మలయాళంలో పలువురు స్టార్ హీరోల సరసన మీనా నటించింది. మోహన్ లాల్ హీరోగా 2005లో వచ్చిన తన్మాత్ర అనే మూవీలో కనిపించింది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో ఓ ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సీన్‌లో మోహన్ లాల్ పూర్తి నగ్నంగా నటించాల్సి వచ్చిందని తెలిపింది. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయని.. ఇలా చేస్తున్నందుకు షూటింగ్‌కు ముందే మోహన్ లాల్ తనకు క్షమాపణ చెప్పాడని మీరా గుర్తుచేసుకుంది.
మీరా వాసుదేవన్ మాట్లాడుతూ.. "నేను అతన్ని ఒకే ఒక్క విషయం అడిగా. ఈ సన్నివేశం ఎందుకు అవసరం? దాని ఉద్దేశ్యం ఏమిటి?' అని ప్రశ్నించా. కానీ ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచే రెండు పాత్రలను చాలా దగ్గరగా చిత్రీకరించారు. ఇది కూడా ఒక సన్నిహిత కుటుంబం. భార్యాభర్తలు ఎల్లప్పుడూ చాలా సున్నితంగా, భావోద్వేగంగా ఉంటారు. ఈ సీన్‌లో మోహన్ లాల్ సర్ పూర్తిగా నగ్నంగా నటించాల్సి రావడంతో ఆయనకు చాలా కష్టంగా అనిపించింది. అతనికి మరింత సవాలుగా అనిపించింది. ఈ సీన్‌లో నా గురించి, నా గౌరవం గురించి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఆయన చాలా ప్రొఫెషనల్. దీంతో షూట్‌కు ముందే మోహన్ లాల్ స్వయంగా వచ్చి నాకు క్షమాపణలు చెప్పా. ఇలా చేయాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెడితే సారీ' చెప్పారని" తెలిపింది.
కాగా.. ఈ చిత్రం ఉత్తమ మలయాళ మూవీగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో పాటు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను కూడా అందుకుంది. ఈ చిత్రం మోహన్ లాల్‌కు ఉత్తమ నటుడిగా ఐదోసారి రాష్ట్ర అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఇటీవలే మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మీరా వాసుదేవన్ కెరీర్..
మీరా వాసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్‌మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.


