'మగాడిలా తయారవుతున్నావ్‌'.. నటి కూతురి కౌంటర్‌ | Malayalam Actress Manju Pillai Daughter Daya Sujith Strong Counter Troller | Sakshi
Sakshi News home page

నీకే మగతనం లేదు.. ట్రోలర్‌కు ఇచ్చిపడేసిన నటి కూతురు

Jan 3 2026 1:13 PM | Updated on Jan 3 2026 1:29 PM

Malayalam Actress Manju Pillai Daughter Daya Sujith Strong Counter Troller

మలయాళ నటి, యాంకర్‌ మంజు పిళ్లై- దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ సుజిత్‌ వాసుదేవన్‌ల కూతురు దయ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. కాస్త బొద్దుగా ఉన్నందుకు కొందరు తనపై నోటికొచ్చిన కామెంట్స్‌ చేస్తున్నారని వాపోయింది. ఇటీవలే ఆమె జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టగా.. రానురానూ మగాడిలా తయారవుతున్నావని ఓ వ్యక్తి విమర్శించాడు.

నీకు మగతనం లేదు
దీనిపై దయ సోషల్‌ మీడియా వేదికగా కౌంటరిచ్చింది. నాలో మగతనం ఉందని, జిమ్‌కు వెళ్తే పూర్తిగా మగాడినైపోతానని ఓ వ్యక్తి అన్నాడు. నాలో ఈ మగతనం నీకు అసౌకర్యాన్ని కలిగిస్తే సారీ.. నాలోని ఈ మగతనాన్ని అంగీకరించేంత పౌరుషం మీకు లేకపోవడం బాధగా ఉంది. మీరు నాకంటే పెద్ద మగాడినని ఒప్పుకునేంత మగతనం లేకపోవడం విచారకరం అని పేర్కొంది.

 

 

చదవండి: హిందీలో డియర్‌ కామ్రేడ్‌? స్పందించిన బాలీవుడ్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement