కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్న ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రేమంటే'. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్. యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఫన్నీగా ఆకట్టుకునేలా ఉంది.
(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)
మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. చూడాలి మరి ఆమె నటన ఎలా ఉండబోతుందో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


