శ్రీజ ప్లాన్‌ ఇదే.. అందుకే కల్యాణ్‌, తనూజలపై ఫైర్‌ | Dammu Srija Bigg Boss Re Entry Rumours Went Viral, Shocking Statements On Kalyan And Thanuja | Sakshi
Sakshi News home page

శ్రీజ ప్లాన్‌ ఇదే.. అందుకే కల్యాణ్‌, తనూజలపై విమర్శలు

Oct 28 2025 7:48 AM | Updated on Oct 28 2025 10:37 AM

Dammu srija bigg boss re entry time statements on kalyan and thanuja

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది.  అక్టోబర్ 27న సోమవారం నామినేషన్‌ ప్రక్రియ మంచి బజ్‌తోనే మొదలైంది. సాధారణంగా హౌస్‌మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్‌బాస్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్‌బాస్‌ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్‌ అయింది. కల్యాణ్‌, తనూజ, మాధురిని టార్గెట్‌ చేసి హౌస్‌లోకి దిగింది.

సంజనపై ప్రియ ఫైర్‌
నామినేషన్‌ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్‌ అని కామెంట్‌ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్‌ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్‌లోకి  మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్‌ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్‌ను్‌ మోసం చేశావ్‌ అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేశాడు. కల్యాణ్‌ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.

ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే  రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్‌ చేస్తున్నావ్‌ అంటూ మొదట కల్యాణ్‌ ఆ తర్వాత పవన్‌లతో గేమ్‌ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్‌తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్‌ చేసింది. రీతూ ఎపిసోడ్‌ కాగానే సుమన్‌ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్‌ చెప్పాడు. కెప్టెన్‌ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్‌ చేస్తాడు. దీంతో ఈ హౌస్‌లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.

మాధురిని టార్గెట్‌ చేసిన శ్రీజ
బిగ్‌బాస్‌లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్‌తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది.  ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ  మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్‌లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది.  బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.

కల్యాణ్‌, తనూజలపై టార్గెట్‌..పక్కా ప్లాన్‌తో శ్రీజ
శ్రీజ నామినేట్‌ చేసింది కల్యాణ్‌ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది.  ఈ క్రమంలో ఫస్ట్‌ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్‌ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్‌ను తగ్గించేలా స్కెచ్‌ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్‌లో ఉన్న కల్యాణ్‌, తనూజలను టార్గెట్‌ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్‌ అమలు చేసింది. 

ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్‌మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్‌ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్‌ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్‌ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్‌ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్‌లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్‌ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్‌ విజయవంతమైంది.

కల్యాణ్‌,తనూజలను ఇరికించిన శ్రీజ
నువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్‌ను శ్రీజ నామినేట్‌ చేసింది. ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్‌లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్‌.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్‌.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్‌ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్‌ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్‌ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో  మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్‌ చేశారో అదే పర్సన్‌తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి  రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది.  ఇలా కల్యాణ్‌, తనూజల ఇమేజ్‌ను తగ్గించాలనే పక్కా ప్లాన్‌తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement