
బిగ్‌బాస్‌లో ఈ వారం నామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లు మొదలయ్యాయి. బుధవారం జరిగిన 25వ ఎపిసోడ్‌లో సంజన, హరీష్‌ల టాపిక్‌తో పాటు తనూజ లవ్ స్టోరీనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. టాస్క్‌లలో మాత్రం కల్యాణ్, శ్రీజ, రీతూ చౌదరి, దివ్య ఒక రేంజ్‌లో దుమ్ములేపారు. ఇమ్మానుయేల్ తన కామెడీ పంచ్‌లతో పాటు ఆటలోనూ సత్తా చాటాడు. అయితే, భరణి మాత్రం చాలా పేలవంగా తన టీమ్‌ను ఎంచుకోవడంతో పాటు సరైన పోటీ ఇవ్వలేకపోయారు. ఈ వారం నామినేషన్‌లో రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ ఉన్న విషయం తెలిసిందే.
తనూజ ప్రేమ కథ
రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్ కలిసి పక్కా ప్లాన్‌తో తనూజ, కళ్యాణ్‌లను పిలిపిస్తారు. వారితో పాటు దమ్ము శ్రీజ కూడా కలిసిపోతుంది. వారందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. అందులో తనూజకి ట్రూత్ అని వస్తుంది. ‘నీవు బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి..? అంటూ అడుగుతారు. దాంతో తనూజ.. ‘హృతిక్ రోషన్ అని సమాధానం చెబుతుంది. ఆ తరువాత కళ్యాణ్ వంతు వస్తుంది. బిగ్‌బాస్‌లో ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు అనిపించేదెవరు? అంటూ అడుగుతారు. కల్యాణ్ ఒక్క క్షణం ఆలోచించకుండా తనూజ అనేస్తాడు. ఆ తర్వాత మళ్లీ తనూజ వంతు వస్తుంది.

తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటూ రీతూ అడుగుతుంది. ఈ క్రమంలో తనూజ కూడా ఫస్ట్ లవ్ స్టోరీ 8వ తరగతిలోనే మొదలైందని చెబుతుంది. అతని పేరు కూడా కల్యాణ్ అని చెప్పడంతో హౌస్‌లో ఉన్న కల్యాణ్ తెగ సంబరపడిపోతాడు. నవ్వేసుకుంటూ మెలికలు తిరిగిపోయాడు. తనూజ లవ్ స్టోరీ డ్యాన్స్ క్లాస్‌లో మొదలైందని గుర్తుచేసుకుంటుంది. ఒక గ్రీటింగ్ ఇచ్చి మొదట తనే ప్రపోజ్ చేశాడని పంచుకుంది. తన జీవితంలో అదే మొదటి లవ్ అంటూనే అది వన్‌సైడ్ లవ్ స్టోరీ అని చెప్పింది. అయితే, ఆ అబ్బాయి మంచి వాడు కావడంతో ఇప్పటికీ తనతో టచ్‌లో ఉన్నాడని చెప్పింది. తనకి పెళ్లి కూడా అయిపోయిందని తన క్యూట్ లవ్‌స్టోరీని తనూజ చెప్పింది. ఆ తరువాత మళ్లీ తనూజకు డేర్ రావడంతో.. కల్యాణ్‌తో డ్యాన్స్ చేసింది.

బిగ్‌బాస్‌లో శివంగులు
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్‌తో పాటు లగ్జరీ ఐటెమ్స్‌ను బిగ్‌బాస్ ఆఫర్ చేశాడు. రణరంగంలా జరిగిన ఈ టాస్క్ కోసం హౌస్ మొత్తాన్ని నాలుగు టీమ్‌లుగా డివైడ్ చేశాడు. అయతే, కెప్టెన్ డీమాన్ పవన్‌ని మళ్లీ సంచాలక్‌గా ఉంచారు. కల్యాణ్, ఇమ్మానుయేల్, ఫ్లోరా (రెడ్ టీమ్) రాము, సంజన, సుమన్ శెట్టి (ఎల్లో టీమ్), హరీష్, తనూజ, రీతూ చౌదరి (బ్లూ టీమ్), భరణి,శ్రీజ, దివ్య (గ్రీన్ టీమ్)లుగా ఉన్నారు.
ఈ ఎపిసోడ్‌లో కల్యాణ్ తన ఆటతో పూర్తిగా డామినేట్ చేశాడు. తనను అడ్డుకునేందుకు కూడా ఇతర కంటెస్టెంట్స్ భయపడేలా చేశాడు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్సీ మొదటి పోటీదారుడిగా ఆర్హత పొందాడు. అయితే, జరిగిన రెండు ఎపిసోడ్స్‌లలో శ్రీజ తన దమ్ము ఏంటో చూపింది. తీవ్రంగా గాయపడినప్పటికీ తన జట్టును గెలిపించి సత్తా ఏంటో చూపింది. ఒకానొక సమయంలో శ్రీజను అడ్డకుంటే చాలు గెలుపు మనదే అని కల్యాణ్ కూడా అంటాడు. అంతలా ఆమె తన ఆటను చూపింది. మరోవైపు దివ్య కూడా సరైన సమయంలో తన ఆట ఎలా ఉంటుందో చూపింది. ఒకసారి ఏకంగా హరీష్, రీతూలను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కొంత సేపు వారిద్దరినీ కదలనీయకుండా అడ్డకుంది. రీతూ చౌదరి కూడా తనలోని గేమర్‌ను బయటకు తెచ్చింది. ఎదురుగా కల్యాణ్ ఉన్నా సరే తన స్ట్రాటజీతో మెప్పించింది. ఈ వారం శ్రీజ, దివ్య, రీతూ ఒక శివంగుల మాదిర తమ ఆటను చూపారు. బిగ్‌బాస్ అసలైన రణరంగం ఏంటో ప్రేక్షకులు చూపించారు. అయితే, కల్యాణ్ దాటికి ఇప్పటికే శ్రీజ, దవ్య టాస్క్ నుంచి విరమించారు.