కథా చర్చలకు కాస్త బ్రేక్‌ అంటున్న మెగా హీరో! | Allu Sirish Tweet About ABCD Story Discussions | Sakshi
Sakshi News home page

Aug 11 2018 8:29 PM | Updated on Aug 11 2018 8:35 PM

Allu Sirish Tweet About ABCD Story Discussions - Sakshi

పనికి కాస్త విరామం.. సైక్లింగ్‌కు వెళ్తున్నాము

మెగా హీరోలందరిలో కెల్లా అల్లు శిరీష్‌ కాస్త నెమ్మదించాడు. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. 1971 సినిమా వచ్చినా అది డబ్బింగ్‌ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ సినిమాను రీమేక్‌ చేయబోతోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ రీమేక్‌కు సంబంధించిన స్టోరీ డిస్కషన్‌ బెంగళూరులో జరుగుతోంది. కథలో మార్పులు చేర్పులు చేయడానికి అక్కడ కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ పనికి కాస్త విరామం ఇస్తూ.. సైక్లింగ్‌కు వెళ్తున్నామంటూ శిరీష్‌ ట్వీట్‌ చేశాడు. 

యూఎస్‌ నుంచి ట్రిప్‌ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ను లీడ్‌ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్‌ ప్రకటించారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర’ శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement