స‌లార్‌, దేవ‌ర స‌హా అవ‌న్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే.. కానీ ఆ ఒక్క‌టే.. | Netflix Announce Allu Sirish Buddy Movie Will Stream This Year | Sakshi
Sakshi News home page

OTT: నెట్‌ఫ్లిక్స్‌లో పండ‌గ‌.. వ‌రుస‌గా అప్‌డేట్స్‌.. ఆ ఒక్క‌టి మాత్రం!

Jan 15 2024 1:59 PM | Updated on Jan 16 2024 1:32 PM

Netflix Announce Allu Sirish Buddy Movie Will Stream This Year - Sakshi

స‌లార్‌, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి, దేవ‌ర, బ‌డ్డీ త‌దిత‌ర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాల‌య్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా స‌హా ఇంకా టైటిల్ ఖ‌రారు కాని చిత్రాల పోస్ట‌ర్లు వ‌దులుతూ అవి థియేట‌ర్లో రి

సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ పండ‌గ పేరిట‌ ప‌లు సినిమాల అప్‌డేట్‌ల‌ను వ‌రుస పెట్టి వ‌దులుతోంది. స‌లార్‌, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి, దేవ‌ర, బ‌డ్డీ త‌దిత‌ర చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాల‌య్య 109వ చిత్రం, కార్తికేయ కొత్త సినిమా స‌హా ఇంకా టైటిల్ ఖ‌రారు కాని చిత్రాల పోస్ట‌ర్లు వ‌దులుతూ అవి థియేట‌ర్లో రిలీజైన కొంత‌కాలానికే అందుబాటులోకి తేనున్న‌ట్లు తెలిపింది.

సందీప్ స్థానంలో అల్లు శిరీష్‌
అయితే ఇందులో ఆస‌క్తి గొలుపుతున్న మూవీ బ‌డ్డీ. నిజానికి ఈ సినిమా పేరు విన‌గానే ఇది త‌మిళంలో వ‌చ్చిన టెడ్డీ చిత్రానికి రీమేక్ అనుకున్నారంతా! కానీ హీరో సందీప్ కిష‌న్ ఇది రీమేక్ కాద‌ని అప్ప‌ట్లోనే క్లారిటీ ఇచ్చాడు. థియేట‌ర్‌లో రిలీజైన త‌ర్వాత‌ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌క‌టించాడు. ఇది గ‌తేడాది ముచ్చ‌ట‌. క‌ట్ చేస్తే స‌డ‌న్‌గా ఈ సినిమాలోకి అల్లు శిరీష్ వ‌చ్చాడు, సందీప్ కిష‌న్ సైడైపోయాడు!ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు అంద‌రూ పాత‌వారే!

గ‌తేడాది, ఇప్పుడు సేమ్ క్యాప్ష‌న్‌.. పోస్ట‌ర్ మారిందంతే
సంక్రాంతి సంద‌ర్భంగా అల్లు శిరీష్ 'బ‌డ్డీ' పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌. పోయిన సంవ‌త్స‌రం పెట్టిన క్యాప్ష‌న్‌ను య‌థాత‌థంగా పెట్టేసింది. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ రిలీజ్‌, ఆ త‌ర్వాత ఓటీటీలోకి రాబోతుంద‌ని, ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఇది చూసిన జ‌నాలు న‌వ్వాపుకుంటున్నారు. పోయిన ఏడాది కూడా ఇదే మాట చెప్పావ్‌, జ‌ర‌గ‌లేదు.. మ‌రి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ ఉంటుందా? లేదా? అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. సామ్ ఆంటోని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌, గోకుల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌రి ఈ మూవీ ఎప్పుడు రిలీజ‌వుతుందో చూడాలి!

చ‌ద‌వండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement