
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త సినిమా 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' గురించి ఓటీటీ ప్రకటన వచ్చేసింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. చిత్రపరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా ఇలా మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించడంతో ఆయనకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, ఈ సారి నిర్మాతగా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మార్గన్’ అనే చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.
మార్గన్ సినిమా జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. కోలీవుడ్ ప్రముఖ ఓటీటీ సంస్థ 'టెంట్‌కొట్ట'లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ఎక్కువగా తమిళ సినిమాలే ప్రదర్శనకు వస్తుంటాయి. ఇప్పుడు మార్గన్ చిత్రం కూడా తమిళ్ వర్షన్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. జులై 25 నుంచే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.

కథ ఏంటి..?
నగరంలో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఓ ఇంజక్షన్ ద్వారా ఆమెను హత్య చేస్తారు. ఆమె శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. సంచలనంగా మారిన ఆ కేసును చేధించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ (విజయ్ ఆంటోనీ) రంగలోకి దిగుతాడు. సుమారు పదేళ్ల క్రితం తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురికావడంతో ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని ధృవ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. తన కూతురిలా ఇంకెవ్వరూ బలి కావొద్దని అనుకుంటాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు.
కానీ, అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలను ధృవ తెలుసుకుంటాడు. ఈ హత్యలకు ఆరవింద్‌కు సంబంధం ఉందా. ధృవ కూతురిని చంపింది ఎవరు..? ఈ కేసును పరిష్కరించే క్రమంలో అఖిల, శ్రుతి (బ్రిగిడా), రమ్య (దీప్శిఖ), వెన్నెల, మేఘల పాత్ర ఏంటి..? ఫైనల్‌గా హంతకుడు ఎలా దొరికాడు..? అనేది తెలియాలంటే మార్గాన్ సినిమా చూడాల్సిందే.