
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. ప్రస్తుతం థియేటర్లలో కన్నప్ప సందడి చేస్తుండగా.. ఈ వారంలో తమ్ముడు అంటూ నితిన్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ గౌతమ్ నటించిన సోలో బాయ్ కూడా బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు.
మిమ్మల్ని అలరించేందుకు ఈ వారం కూడా బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా తెలుగులో వస్తోన్న ఉప్పు కప్పురంబు సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ గుడ్ వైఫ్, ప్రియాంక చోప్రా హెడ్ ఆఫ్ స్టేట్, అమితాబ్ బచ్చన్ నటించిన కాళిధర్ లపతా కాస్తా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు కమల్ హాసన్ నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ కూడా ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూలై మూడో తేదీ నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. మరి ఏ యే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్..
అటాక్ ఆన్ లండన్- హంటింగ్ ది 7/7 బాంబర్స్- జూలై 01
ది ఓల్డ్ గార్డ్-2- జూలై 02
థగ్ లైఫ్(తమిళ సినిమా)- జూలై 03(రూమర్ డేట్)
ది శాండ్‌మాన్ సీజన్-2- జూలై 03
ది సమ్మర్ హికరు డైడ్- జూలై 05
అమెజాన్ ప్రైమ్ వీడియో..
ది హెడ్స్ ఆఫ్ స్టేట్- జూలై 02
ఉప్పు కప్పురంబు(తెలుగు సినిమా)- జూలై 04
జియో హాట్‌స్టార్
కంపానియన్- జూన్ 30
గుడ్ వైఫ్(వెబ్ సిరీస్)- జూలై 04
జీ5
కాళిధర్ లపతా(హిందీ సినిమా)- జూలై 04
సోనిలివ్
ది హంట్- రాజీవ్ గాంధీ హత్య కేసు- జూలై 04