
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్ల సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారంలో శ్రీలీల- కిరీటి జంటగా నటించిన జూనియర్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే ధనుశ్- నాగార్జున నటించిన కుబేర డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సైతం ఓటీటీలో అలరించనుంది. బాలీవుడ్ నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రం ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ శుక్రవారమే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందా? అయితే ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.
అమెజాన్ ప్రైమ్
కుబేర (తెలుగు మూవీ) - జూలై 18
నెట్‌ఫ్లిక్స్
వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
వాల్ టూ వాల్ - (కొరియన్ సినిమా)- జూలై 18
డెరిలియమ్ - (వెబ్ సిరీస్)- జూలై 18
ఆల్మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18
డిలైట్‌ఫుల్లీ డిసీట్‌ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18
జియో హాట్‍స్టార్
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18
స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
జీ5
భైరవం (తెలుగు సినిమా) - జూలై 18
ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18
ఆపిల్ ప్లస్ టీవీ
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18
మనోరమ మ్యాక్స్
అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18