
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. మే 9న విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.
'6జర్నీ' సినిమా సడెన్గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే, ఈ సినిమాను చూడాలంటే రూ. 149 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడిలేని ఈ చిత్రానికి అదనంగా రెంట్ చెల్లించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది.