
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ఈ ఏడాది వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఎలెవన్, బ్లైండ్ స్పాట్ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మెప్పించారు. ఆ తర్వాత నవీన్ చంద్ర నటించిన మరో చిత్రం 'షో టైమ్'. ఈ మూవీ జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీంతో ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
అయితే ఈ మూవీని మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో నవీన్ చంద్ర తెలిపారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని ఓ పోస్టర్ను పంచుకున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్ను మాత్రం రివీల్ చేయలేదు. ఈ ప్రకటనతో షో టైమ్ రెండు ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది. సన్ నెక్స్ట్తో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
షో టైమ్ అసలు కథేంటంటే..
'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష‍్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.
When the truth is too dangerous to reveal, how long can you keep running?#ShowTime, coming soon on Amazon Prime. @PrimeVideoIN#ShowTime #KamakshiBhaskarla @ItsActorNaresh @Rajaraveendar @AnilSunkara1 @kishore_Atv @aruvimadhan #ShekarChandra @sarath_edit @cinemakaran_dop… pic.twitter.com/Ptd0ilnxPG
— Actor Naveen Chandra (@Naveenc212) July 21, 2025