
హిందీ చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీస్‌లో ‘హౌస్‌ఫుల్’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్గా స్ట్రీమింగ్కు రావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖ తారలు ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలో నటించారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మించారు.
కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్5’ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ముందు భాగాలకు పూర్తి భిన్నంగా మరింత నవ్వులు పంచేలా సినిమా ఉండటంతో భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. హౌస్‌ఫుల్ 5 విమర్శకుల నుంచి మిశ్రమ-ప్రతికూల రివ్యూలను అందుకుంది. అయితే, ఇందులోని మహిళల పాత్రల గురించి కాస్త విమర్శలు వచ్చాయి. వారిని వస్తువు రూపంలో చూపించారనే అపవాదు వచ్చింది. ఈ చిత్రం హౌస్‌ఫుల్ 5A, హౌస్‌ఫుల్ 5B అనే రెండు వెర్షన్‌లలో విడుదలైంది. ఇందులో భిన్నమైన క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది.