'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' ఫ్యాన్స్‌కు షాకిస్తున్న బుక్‌మైషో | Ustad Bhagat Singh story synopsis out from BookMyShow | Sakshi
Sakshi News home page

'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' ఫ్యాన్స్‌కు షాకిస్తున్న బుక్‌మైషో

Mar 6 2026 7:36 AM | Updated on Mar 6 2026 9:00 AM

Ustad Bhagat Singh story synopsis out from BookMyShow

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదటగా ఈ మూవీని ఈ నెల 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టాక్సిక్‌ వాయిదా పడటంతో ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు  ప్రకటించారు. అయితే, తాజాగా బుక్‌మైషోలో ఈ మూవీ స్టోరీకి సంబంధించి పాయింట్స్‌ను చేర్చి పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు షాకిచ్చింది.

మొదటి నుంచి ఈ సినిమా 'తేరి' రీమేక్ అని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను అసలు స్క్రిప్ట్‌తో వచ్చానని స్పష్టం చేశారు. ఇప్పుడు, బుక్ మై షోలో ఉస్తాద్ భగత్ సింగ్ కథా సారాంశం అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. అందులో స్టోరీ లైన్‌ ఇలా ఉంది, “ఒక ఐపీఎస్ అధికారి తన  కుమార్తెతో కలిసి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. 

అయితే, క్రూరమైన నేరస్థులు హీరో కుటుంబాన్ని నాశనం చేయడంతో కూతురు కోసం అజ్ఞాతంలోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత హీరో ఆచూకీ తెలుస్తుంది. అతను తన గతానికి సంబంధించిన శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు మిగిలి ఉన్న ఏకైక కూతురుని రక్షించడానికి మరోసారి పోరాడుతాడు.” అంటూ కథకు సంబంధించి కొన్ని పాయింట్స్‌ రాసుకొచ్చాడు.

బుక్‌మైషో టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేర్చబడిన ఈ స్టోరీ లైన్‌ పూర్తిగా తెరి సినిమాను పోలి ఉంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ప్లాట్‌ఫామ్ లోపమా లేదా ప్రధాన కథాంశం అలాగే ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement