ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా

ఇటీవల సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్‌లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్‌కి ముద్దులు ఇస్తున్న పోస్టర్‌ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్‌ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది.
ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం.
Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ
— Allu Sirish (@AlluSirish) May 29, 2021
చదవండి:
సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్..
మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి