మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి

Keerthy Suresh Shares Her Mahanati First Look Test Photo - Sakshi

తన అందం, అభినయంతో హీరోయిన్‌ కీర్తి సూరేశ్‌ ఎంతో ప్రేక్షకాదరణను పొందింది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మ‌హాన‌టి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేష‌న‌ల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఇందులో కీర్తి తన న‌ట‌నతో సావిత్రని మైమరపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించడం విశేషం. 2018లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లో ఎంతవరకు చేరుతుందో లేదో తెలియని ఎన్నో సందేహాల మధ్య థియేటర్లోకి వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది.

అయితే దర్శకుడు నాగ్‌ ఆశ్విన్‌ 2016 నుంచి ఈ సినిమాను తీయాలని ప్లాన్‌ చేశాడట.  సావిత్రకి పాత్ర సరిపోయే నటి కోసం వేతుకుతుండగా.. నేను లోక‌ల్ సినిమా చేస్తున్న స‌మ‌యంలో కీర్తి సురేష్‌ని మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. అయితే ఈ మూవీకి ఒకే చెప్పిన కీర్తి.. ఆ తర్వాత సావిత్రి పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌లుతుందో లేనని చాలా భయపడినట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహానటి మూవీ కోసం త‌న‌కు లుక్ టెస్ట్ చేయ‌గా అచ్చం సావిత్రిని తలపించిందంటు ప్రశంసలు రావడంతో కీర్తి ఊపిరి పీల్చుకుందట. నాడు లంగా ఓణీలో ఉన్న తన ఫస్ట్‌ లుక్‌ టెస్ట్‌ ఫొటోను తాజాగా కీర్తి షేర్‌ చేస్తూ మురిసిపోయింది. దీనికి ‘హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటు తన ఇన్‌స్టా స్టోరిలో అభిమానులతో పంచుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top