ఆకట్టుకుంటోన్న ‘ఏబీసీడీ’ మోషన్‌ పోస్టర్‌!

Allu Sirish ABCD Motion Poster Released - Sakshi

ఎంతో కాలంపాటు బ్రేక్‌ కోసం ఎదురు చూస్తున్న అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌కు ఏబీసీడీ రూపంలో హిట్‌ వచ్చేట్టు కనిపిస్తోంది. మాలీవుడ్‌ హిట్‌ మూవీ రీమేక్‌తో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర మోహన్‌ పోస్టర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. 

ఏబీసీడీ (అమెరికన్‌ బార్న్‌ కన్ఫ్యూజ్డ్‌ దేశీ)గా అల్లు శిరీష్‌ హాస్యాన్ని పండించబోతున్నాడని ఈ మోషన్‌ పోస్టర్‌లో తెలుస్తోంది. అమెరికాలో పుట్టిపెరిగిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో విలేజ్‌కు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో సంజీవ్‌ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యశ్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top