‘తుగ్లక్‌’గా నందమూరి హీరో | Nandamuri Kalyan Ram Thuglak With Debut Director | Sakshi
Sakshi News home page

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

Mar 22 2019 1:53 PM | Updated on Mar 22 2019 1:53 PM

Nandamuri Kalyan Ram Thuglak With Debut Director - Sakshi

ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్‌లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్‌ రామ్ ఓకె చెప్పారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్‌ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్‌ రామ్‌. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్‌ కల్యాణ్ రామ్‌ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement