Anu Emmanuel Fires On Reporter At Press Meet, Video Viral - Sakshi
Sakshi News home page

Anu Emmanuel : రిపోర్టర్‌పై హీరోయిన్‌ ఫైర్‌.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?

Oct 22 2022 3:06 PM | Updated on Oct 22 2022 3:55 PM

Anu Emmanuel Fires On Reporter At Press Meet Video Viral - Sakshi

మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయెల్‌. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా అల్లు శిరీష్‌తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ ఫైర్‌ అయ్యింది.

''మీరు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చేశారు. ఇప్పుడు శిరీష్‌తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ''? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో అసహనానికి గురైన అను మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ కోప్పడింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ కావడంతో అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా అను, శిరీష్‌ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement