రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన అల్లు హీరో | Allu Sirish New Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

Oct 11 2018 11:28 AM | Updated on Oct 11 2018 12:14 PM

Allu Sirish New Movie Release Date Fix - Sakshi

కెరీర్‌లో భారీ హిట్‌ లేక సతమతమవుతున్నాడు మెగాహీరో అల్లు శిరీష్‌. దాంతో ఆచితూచి సినిమాలను సెలెక్ట్‌ చేస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. ‘1971’ సినిమా వచ్చినా అది డబ్బింగ్‌ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయింది. గ్యాప్‌ తీసుకున్నా పర్లేదు కానీ భారీ హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో మాలీవుడ్‌లో హిట్ అయిన ఏబీసీడీ (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) సినిమాను రీమేక్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అదే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శిరీష్‌ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్‌ రుక్సర్‌ థిల్లాన్‌ సొంతం చేసుకున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.

యూఎస్‌ నుంచి ట్రిప్‌ కోసం ఇండియాకు వచ్చిన ఓ అబ్బాయి మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌ను లీడ్‌ చేసి, ఏం తెలుసుకున్నాడన్నది ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తనకి ఈ సినిమాతో మంచి హిట్‌ లభిస్తుందని ఈ మెగా హీరో కోటి ఆశలు పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ న్యూస్‌ను అల్లూ శిరీష్‌ స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘సినిమాలో నేను కన్‌ఫ్యూజ్డ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను కావచ్చు. కానీ ప్రేక్షకులందరికీ ఫిబ్రవరి 8, 2019న థియేటర్‌లో వినోదాన్ని పంచడం పక్కా’అంటూ పోస్ట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement