అల్లు శిరీష్‌కు ఎంత పెద్ద మనసో..!! | Allu Sirish Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

అల్లు శిరీష్‌కు ఎంత పెద్ద మనసో..!!

Sep 27 2018 12:45 PM | Updated on Sep 27 2018 12:45 PM

Allu Sirish Tweet Goes Viral - Sakshi

విండోస్‌ యూజర్‌గా 20 ఏళ్ల పాటు కొనసాగిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌, మ్యాక్‌ యూజర్‌గా మారిపోయారు. తన అన్న అల్లు అర్జున్‌ ఇచ్చిన గిఫ్ట్‌తో అల్లు శిరీష్‌కు కొత్త ల్యాప్‌టాప్‌ వచ్చేసింది. ఈ సందర్భంగా తన అన్నకు కృతజ్ఞత చెబుతూ.. అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు వెంటనే రిప్లైగా ఓ యూజర్‌ ఒక ట్వీట్‌ చేశాడు. ‘అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్‌టాప్‌ గిఫ్ట్‌ ఇవ్వు అన్నా. నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది. శాలరీ తక్కువ. నా ఉద్యోగంలో ల్యాప్‌టాప్‌ వాడకం ఎక్కువ కానీ నాకు ల్యాప్‌టాప్‌ లేదు. కానీ నేను మీకు చాలా పెద్ద అభిమానిని శ్రీ’ అంటూ అల్లు అర్జున్‌కు, అ‍ల్లు శిరీష్‌కు ఆ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశాడు. అభిమాని బాధను అర్థం చేసుకున్న వెంటనే అల్లు శిరీష్‌,  ‘అయ్యో.. బాధపడకు బ్రదర్‌, నీవు సంపాదిస్తున్నావు. మీ కుటుంబాన్ని పోషిస్తున్నాయి. నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్‌ ఉంది. నా సోని వైవో ల్యాప్‌టాప్‌ను నీవు తీసుకో. కూల్‌.  నాకు డైరెక్ట్‌ మెసేజ్‌ పంపు. చీర్స్‌’ అంటూ ఈ యంగ్‌ హీరో ట్వీట్‌ చేశారు. 

ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అల్లు శిరీష్‌కు ఎంతో పెద్ద మనసో అంటూ.. అభినందనలు వెల్లువ కొనసాగుతోంది. సూపర్‌ అన్నయ్య మీలాంటి వాళ్లు రిప్లయ్‌ ఇవ్వడమే గొప్ప గిఫ్ట్‌ అని, దయా హృదయం అంటూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అల్లు శిరీష్‌ అభిమానులు. కొంతమంది కొంటె అభిమానులు ‘అన్నా.. నాకు ఎప్పుడు ఇస్తావు గిఫ్ట్‌’ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. బ్రదర్‌ నాకు ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ కావాలి. కొనాలంటే ఐదేళ్లు పట్టేలా ఉంది అంటూ మరో యూజర్‌ కొంటెగా రిప్లయి ఇచ్చాడు. అన్నా అలాగే ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని ఏపీ 9 బీడ్ల్యూ 666 ని నాకు ఇచ్చేయ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. త్వరలో అ‍ల్లు అర్జున్‌ మీకు కొత్త కారు గిఫ్ట్‌గా ఇస్తారంటూ కూడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement