సాక్షి, తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/IZfKKe17d7
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2026
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు.


