కల్యాణం.. వైభోగం... | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. వైభోగం...

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

కల్యాణం.. వైభోగం...

కల్యాణం.. వైభోగం...

కల్యాణం.. వైభోగం...

రేపల్లె: ఉప్పూడి రోడ్డులో వేంచేసియున్న శ్రీలక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ అర్చకులు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి, దేవేర్లుకు మంగళస్నానాలు చేయించి పట్టువస్త్రాలు, పువ్వులతో వధువరులుగా అలంకరించారు. వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి కల్యాణం చేశారు. స్వామివారి పరిణయ ఘట్టాలను భక్తులకు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ చేశారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement