సమాచారం తెలుసుకోండి | - | Sakshi
Sakshi News home page

సమాచారం తెలుసుకోండి

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

సమాచారం తెలుసుకోండి

సమాచారం తెలుసుకోండి

సమాచారం తెలుసుకోండి

పట్టించుకోని ఇన్‌స్పెక్టర్‌

లక్ష్మీపురం (గుంటూరు వె స్ట్‌): అధికార పార్టీ అండతో కొందరు రెచ్చిపోతున్నారు. కబ్జాలకు పాల్పడుతున్నారు. నగరంలోని అంజుమన్‌ ఆస్తులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు నగరంలోని నగరంపాలెం వద్ద ఈద్గా స్థలం ఉంది. ప్రతి ఏటా రంజాన్‌, బక్రిద్‌ పర్వదినం రోజున నగరవాసులు భారీ సంఖ్యలో చేరుకుని ఇక్కడ నమాజ్‌ చేయడం ఆనవాయితీ. పండుగ సమయాలు మినహా రోజుల్లో కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ అంజుమన్‌కు నెలవారీ అద్దె చెల్లిస్తున్నారు. పండుగ రోజుల్లో ఈద్గా స్ధలం పూర్తిగా ఖాళీ చేసి నమాజ్‌ చేయడం ఆనవాయితీ. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈద్గా స్థలంపై తూర్పు ఎమ్మెల్యే కన్నుపడింది. చిరు వ్యాపారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ ప్రదేశంలో ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రి పక్కనే ఓ టీ బంక్‌ ఉండేది. దానిని ఖాళీ చేయించారు. ఇటీవల నూతనంగా శాశ్వతంగా టీ స్టాల్‌ నిర్మాణం చేయడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

కొత్తగా షెడ్‌ నిర్మాణం..

సుమారు ఏడాది క్రితం ఈద్గా స్థలంలో పెద్ద షెడ్‌ నిర్మించి దానిలో ఏపీ కార్స్‌ పేరుతో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల క్రయవిక్రయాలు జరిపే వారికి అద్దెకు ఇచ్చారు. ఈ విషయంపై ముస్లిం సంఘాలు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గత ఏడాది రంజాన్‌, బక్రీద్‌ పండుగులకు షెడ్‌ను తొలిగించకుండానే నగర ముస్లింలు పవిత్ర పండుగ నమాజ్‌ను పూర్తి చేసుకున్నారు. సంబంధిత వక్ఫ్‌, అంజుమన్‌ కమిటీలపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ కొట్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ముస్లిం సంఘాలు అడ్డు పడ్డాయి. నిర్మాణ పనులు నిలిపి వేశారు. గత కొన్ని రోజులుగా ఆ పనులు పునఃప్రారంభం అయ్యాయి. ఈ సారి టీ కొట్టును శాశ్వతంగా నిర్మించారు. టీ కొట్టులో టైల్స్‌, లైటింగ్‌లతోపాటు ఈద్గా స్థలంలో సుమారు 50 గజాల విస్తీర్ణంలో సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేశారు. దీన్ని గమనించిన నగర వాసులు పవిత్ర రంజాన్‌ మాసంలో ఇంతటి ఆక్రమణకు పాల్పడితే ఉపవాస దీక్షలు పూర్తి అయిన తరువాత నమాజ్‌ ఏవిధంగా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతుంటే కనీస బాధ్యతగా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ వ్యవహరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతనంగా ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణపై కనీస దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రతి శుక్రవారం మాత్రం గుంటూరు కాకానిలోని హజ్రత్‌ బాజీ బాబా దర్గాలో విధులు నిర్వహిస్తున్నారు. దర్గా హుండీ కానుకలపై ఉన్న శ్రద్ధ ఈద్గా స్థలం పరిరక్షణకు లేకపోవడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈద్గా స్థలంలో నూతన షాపు నిర్మాణానికి వక్ఫ్‌బోర్డు అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం కుదరదు. ఎప్పుడు బడితే అప్పుడు ఫోన్‌ చేస్తే వీలుకాదు. అంతగా సమాచారం కావాలంటే వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని వివరాలు తీసుకోవచ్చు.

– ఖాజా, గుంటూరు జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement