చిన్నారి తమ్ముడికి ప్రేమతో : అల్లు అర్జున్‌ | Allu Arjun Birthday Wishes to Allu Sirish | Sakshi
Sakshi News home page

May 30 2018 11:41 AM | Updated on May 30 2018 4:47 PM

Allu Arjun Birthday Wishes to Allu Sirish - Sakshi

అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్‌ హార్ట్ టచింగ్‌ ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా జీవితంలోని తొలి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిన్నారి నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో అతి ఎక్కువ జ్ఞాపకాలను, రహస్యాలను పంచుకుంది కూడా ఇతనితోనే. నా చిన్నారి తమ్ముడు సిరి (శిరీష్‌)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌ తో పాటు అల్లు శిరీష్‌, అల్లు అర్జున్‌ ఫ్యామిలీ కేక్‌ కట్‌ చేయిస్తున్న ఫొటోను ట్వీట్‌ చేశాడు అల్లు అర్జున్‌.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్‌ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. శిరీష్ ప్రస్తుతం మలయాళ సినిమా ఏబీసీడీ రీమేక్‌తో పాటు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement