మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు | Deepika Shoots Raaka In 8th Month Of Pregnancy | Sakshi
Sakshi News home page

మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు

Aug 11 2026 11:27 AM | Updated on Aug 11 2026 11:32 AM

Deepika Shoots Raaka In 8th Month Of Pregnancy

సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్‌ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు 
వైరల్‌ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

షూటింగ్‌లో మళ్లీ బన్నీ..

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్‌లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్‌ షెడ్యూల్‌ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్‌లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.

గతంలోనూ వైరల్‌..

దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్‌లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్‌ టేకింగ్‌కు అల్లు అర్జున్‌ క్రేజ్‌ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement