breaking news
rakha
-
ఆ కంచుకోటలో ఇంటర్నెట్పై నిషేధం
బీరుట్: సిరియాలోని తన కంచుకోట రఖాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రై వేట్గా ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధించింది. ప్రజలే కాకుండా ఐఎస్ ఉగ్రవాదులు సైతం తమ పర్యవేక్షణలోని ఇంటర్నెట్ కేఫ్‌లలోనే ఇంటర్నెట్ను వినియోగించుకునేలా ఆంక్షలు విధించింది. ప్రై వేట్ వైఫై కనెనక్షన్లను నాలుగు రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ ఐఎస్ ఆదివారం కరపత్రాలను కూడా పంపిణీ చేసిందని ఈ మేరకు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్, యాక్టివిస్ట్ గ్రూప్ రఖా సంస్థలు వెల్లడించాయి. ఇంటర్నెట్ కేఫ్‌లలో మినహాయించి ఇతర అన్ని వ్యక్తిగత ప్రదేశాల్లో, ఐఎస్ ఫైటర్లకు కూడా వైఫై సేవలను ఆపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్లు తెలిపాయి. ఇలాంటి ఆంక్షలతో తమ రెండు సంస్థలను నిరోధించాలని ఐఎస్ ప్రయత్నిస్తోందని హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. ఇంటర్నెట్ కేఫ్‌లపై దాడులు చేస్తూ, వార్తలు పంపేవారిపై నిఘా పెడుతున్నారని, సిరియాయేతర ఐఎస్ ఫైటర్లు తిరిగి వెళ్లిపోతారన్న భయంతో వారిని కుటుంబసభ్యులతో ఫోన్లో సైతం మాట్లాడనీయడం లేదని వెల్లడించాయి. -
లవ్లీ జర్నీ
ప్రశాంత్ లహోటి, రేఖ లహోటి YOU AND I "Success in marriage does not come merely through finding the right mate, but through being the right mate" అన్నాడు బార్నెట్ ఆర్ బ్రిక్నర్. ఆర్టిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ రేఖ లహోటి, ఇంజనీర్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ లహోటి.. ఈ ఇద్దరూ అంతే! ఒకరికొకరు సరి జోడు అనుకొని జతకూడలేదు. జంట ప్రయాణంలో ఒకరికొకరు తగిన తోడుగా తమనుతాము మలచుకుంటున్నారు. ఆ సర్దుబాటు, దిద్దుబాటే వాళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతోంది! ఆ దంపతుల ముచ్చట్లు... ..:: సరస్వతి రమ ‘జాతకాలు కుదిర్చిన పెళ్లి మాది’ అని మొదలుపెట్టారు ఇద్దరూ! సంభాషణకు ముందు రెండు కుటుంబ నేపథ్యాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ బెంగాలీ అయినా పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. ఆ మాటకొస్తే 150 ఏళ్ల కిందటే వాళ్ల పూర్వీకులు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. అందుకే ‘నేను పక్కా హైదరాబాదీ’ అంటాడాయన. రేఖ పుట్టిపెరిగిందంతా కోల్‌కతాలోనే. ప్రశాంత్‌తో కొంగుముడివేసుకున్నాకే హైదరాబాద్ ఆమెకు పరిచయమైంది. వ్యక్తిత్వాలు,నేపథ్యాలు కన్నా.. ‘నేను చిన్నప్పటి నుంచి బబ్లీ టైప్. పదిహేనోయేట నుంచే డ్రైవింగ్ చేసేదాన్ని. కలివిడితనం ఎక్కువ. దాంతో మా ఇంట్లో వాళ్లంతా నేను లవ్ మ్యారేజే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను మాత్రం భిన్నంగా ఆలోచించాను. పుట్టిపెరిగిన కోల్‌కతాలోనే స్థిరపడాలని అనుకోలేదు. బయటి ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాను. కాబట్టి పెద్దలు చూసిన సంబంధానికి ఓకే అన్నాను’ అంటారు రేఖ. ‘మా బంధువుల ద్వారా ఈ సంబంధం ఖాయం అయింది. మా వ్యక్తిత్వాలు, మా నేపథ్యాల కన్నా మా జాతకాలే ముందు మమ్మల్ని కలిపాయి’ అంటూ పెళ్లయిన తీరు చెప్పారు ప్రశాంత్. పూర్తి విరుద్ధం.. ‘స్వభావరీత్యా మేమిద్దరం పూర్తి విరుద్ధం’ అని ఆమె అంటుంటే ‘అందుకే మా రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంది’ అని పూరించారు ఆయన. ‘నాకు కోపమెక్కువ’ అని రేఖ, ‘నాకు ఓపిక ఎక్కువ’ అని ప్రశాంత్, ‘తను చాలా ఉదారంగా ఉంటారు’ అని ఆమె, ‘రేఖ తన మేనేజ్మెంట్ స్కిల్స్‌తో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది’ అని ఆయన, ‘ప్రశాంత్ ఇంట్రావర్ట్. ఆయనకెప్పుడైనా కోపమొస్తే ఎక్స్‌ప్రెస్సే చేయడు. ఆయన అలక తీర్చే చాన్సే ఇవ్వడు’ అని ఆమె, ‘రేఖ వెరీ ఎక్స్‌ప్రెసివ్’ అని ఆయన.. ఇలా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలకు కంప్లయింట్స్ అండ్ కాంప్లిమెంట్స్ రూపమిచ్చారు. కళాకృతి.. ‘మా ఇద్దరి బిడ్డ’ అంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నిజానికి రేఖ మంచి ఆర్టిస్ట్’ అని ప్రశాంత్ కితాబిచ్చేలోపే ‘ఎనిమిదో ఏటనుంచే బొమ్మలు గీసేదాన్ని. డిగ్రీ తర్వాత ఫైనార్ట్స్ కూడా చేశాను. పెళ్ల్లయ్యాక నా మనసు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది. మా అత్తమామల ఎంకరేజ్‌మెంట్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ చేశా. నేను బొమ్మలేయడం కంటే ఎక్కువగా ప్రశాంత్ ఆర్ట్‌ని ఇష్టపడతాడు. ఆయన ఈస్తటిక్సెన్స్కి నిలువెత్తు నిదర్శనమే కళాకృతి ఆర్ట్ గ్యాలరీ’ అని భర్త కళాభిరుచిని వివరించారు రేఖ. ‘దాదాపు 20 ఏళ్ల కింద కళాకృతిని ఏర్పాటు చేశాం. ఆ ఆలోచన వచ్చిన వెంటనే రేఖతో షేర్ చేసుకున్నాను. తనకూ నచ్చింది. అయితే ఆ రోజే అనుకున్నాం.. మా గ్యాలరీ ప్యూర్ ఆర్ట్‌కి డయాస్లాగా ఉండాలి తప్ప కమర్షియల్ ప్రాఫిట్‌కి చానల్‌లా కాదు అని. ఇప్పటికీ ఆ విషయంలో రాజీ లేదు’ అని చెప్తారు ప్రశాంత్. ‘కళాకృతి..ఆలోచన ఆయనది. అనుసరణ నాది. కళాకృతి కాకుండా మా ఇద్దరికీ సపరేట్ కెరీర్ ఉంది. ఆయన బిల్డర్. నాకు బొటిక్ ఉంది. అయినా కళాకృతి మా ఇద్దరి గారాలపట్టి. ఎంత బిజీగా ఉన్నా ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఏ అంశాన్నీ అలక్ష్యం చేయం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త వర్క్ కొలువుదీరేలా ప్రయత్నిస్తుంటాం. అలా త్వరలోనే చక్కటి కాఫీ తాగుతూ నచ్చిన పెయింటింగ్‌ను ఆస్వాదించే కాఫీడేనూ స్టార్ట్ చేయబోతున్నాం’ అని భవిష్యత్ కార్యాచరణను తెలిపారు రేఖ. స్మార్ట్ థింకింగ్ అండ్ హార్డ్‌వర్కింగ్ మీ ఇద్దరి ప్రొఫెషనల్ జర్నీని ఒక వాక్యంలో వర్ణించండి అంటే ‘ఆయనది స్మార్ట్ థింకింగ్ నాది హార్ట్వర్కింగ్’ అని చెప్పారు రేఖ. ‘కళాకృతికి సంబంధించిన విషయం తప్ప మా ఇద్దరి కెరీర్లో ఒకరికొకరం జోక్యం చేసుకోం’ అంటారు ప్రశాంత్. ‘ఆయన అద్భుతమైన ఐడియాలిస్తారు’ అని రేఖ అంటుంటే ‘తను వాటిని అంతకన్నా అద్భుతంగా చేసి చూపిస్తుంది’ అంటారు ప్రశాంత్. ‘మా అమ్మాయికి ఆయన పోలికే. అబ్బాయికి నా పోలిక.వాళ్లిద్దరూ కూర్చున్నచోట అలా ఐడియాలిస్తుంటే మేమిద్దరం కష్టపడుతుంటాం’ అంటారు రేఖ నవ్వుతూ. వ్యత్యాసాలు ఒక్కటయ్యేదెప్పుడు? ‘పిల్లల విషయంలో’ ఏకకంఠంతో ఇద్దరూ. ‘పిల్లల పెంపకంలో మా ఇద్దరి ఆలోచనలు, అనుసరణలు ఒకేరకంగా ఉంటాయి. వాళ్లతో గడిపే సమయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వం’ అంటారిద్దరూ. ప్రశాంత్, రేఖ.. పేజ్ త్రీ కపుల్. ‘ఫ్రెండ్ సర్కిల్‌కి సంబంధించీ ఇద్దరం ఒకేలా ఉంటాం. తొందరగా కొత్తవాళ్లతో క్లోజ్ అయిపోం.నచ్చినవాళ్లు తక్కువమందే. వాళ్లతోనే చాలా సన్నిహితంగా ఉంటాం. గెట్ టు గెదర్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం’ అని చెప్తారు ప్రశాంత్. లవ్లీ జర్నీ.. ‘తప్పొప్పులు, భిన్నాభిప్రాయాలు ఏ జంటకైనా సాధారణం. అయితే అవి ఆర్గ్యుమెంట్స్‌గా కాక డిస్కషన్స్గా ఉంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మా మధ్య డిస్కషన్సే ఎక్కువ’ అని రేఖ అంటారు. ‘తప్పయినప్పుడు సారీ చెప్పడాలు ఉండవ్. ఆ తప్పును సరిదిద్దుకొని ఇంకోసారి అలాంటిది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. అంతే!’ ప్రశాంత్ మాట.‘సరిదిద్దుకున్నామంటేనే ఈ తప్పును అడ్మిట్ చేసుకున్నట్టే కదా’ రేఖ సమర్థింపు. ‘కాలం గడుస్తున్నాకొద్దీ ఇండివిడ్యువల్‌గా ఇద్దరం పరిణతి చెందుతూనే ఉంటాం కదా. ఒకరి మెచ్యూరిటీ ఒకరికి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది’ ఉభయుల కామెంట్. ‘ఏమైనా ఇట్స్ ఎ లవ్లీ జర్నీ’ అంటూ ఈ సంభాషణకు అందమైన ముగింపునిచ్చారు ఇద్దరూ!. -
గర్భిణి అనుమానాస్పద మృతి
కెలమంగలం/ క్రిష్ణగిరి : గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయకోట సమీపంలోని కోడిపుదూర్లో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెను ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తు హతురాలి తండ్రి, అతని బంధువులు అల్లుడి ఇంటిలో విధ్వంసం సృష్టించారు. వివరాలు..కెంబనముత్తూరు గ్రామానికి చెందిన హరిచ్చంద్రన్ కుమార్తె రేఖ(28)కు కోడిపుదూర్కుచెందిన రాజాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం రేఖ 9 నెలల గర్భిణి. ఈ క్రమంలో రేఖ గురువారం విద్యుదాఘాతంలో మృతి చెందినట్లుగా రాజ తన అత్త,మామలకు సమాచారం అందించాడు. వారు గ్రామానికి చేరుకొని కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. తమ కుమార్తెను అల్లుడే పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హత్యకేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపిస్తూ రేఖ మృతదేహంతో ఆ ఇంటి ఎదుటే ధర్నాకు దిగారు. ఓ దశలో ఇంటిలోకి చొరబడి కిటికీలు, టీవీ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినా పట్టించుకోలేదు. హొసూరు సబ్‌కలెక్టర్ ప్రవీణ్.పి.నాయర్ అక్కడకు చేరుకొని మృతురాలి తండ్రితో చర్చించారు. కేసు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం రేఖ మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.