గర్భిణి అనుమానాస్పద మృతి | The mysterious death of a pregnant woman | Sakshi
Sakshi News home page

గర్భిణి అనుమానాస్పద మృతి

Sep 6 2014 2:45 AM | Updated on Aug 21 2018 5:46 PM

గర్భిణి అనుమానాస్పద మృతి - Sakshi

గర్భిణి అనుమానాస్పద మృతి

గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయకోట సమీపంలోని కోడిపుదూర్‌లో చోటు చేసుకుంది.

కెలమంగలం/ క్రిష్ణగిరి : గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయకోట సమీపంలోని కోడిపుదూర్‌లో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెను ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తు హతురాలి తండ్రి, అతని బంధువులు అల్లుడి ఇంటిలో విధ్వంసం సృష్టించారు.    

వివరాలు..కెంబనముత్తూరు గ్రామానికి చెందిన హరిచ్చంద్రన్ కుమార్తె రేఖ(28)కు కోడిపుదూర్‌కుచెందిన రాజాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది.  వీరికి  నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం రేఖ 9 నెలల గర్భిణి. ఈ క్రమంలో రేఖ గురువారం  విద్యుదాఘాతంలో  మృతి చెందినట్లుగా రాజ తన అత్త,మామలకు సమాచారం అందించాడు. వారు గ్రామానికి చేరుకొని కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. తమ కుమార్తెను అల్లుడే పొట్టన పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే హత్యకేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపిస్తూ రేఖ మృతదేహంతో ఆ ఇంటి ఎదుటే ధర్నాకు దిగారు. ఓ దశలో ఇంటిలోకి చొరబడి కిటికీలు, టీవీ ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  నచ్చజెప్పినా పట్టించుకోలేదు.  హొసూరు సబ్‌కలెక్టర్ ప్రవీణ్.పి.నాయర్ అక్కడకు చేరుకొని మృతురాలి తండ్రితో చర్చించారు. కేసు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం రేఖ  మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement