ఎంగేజ్‌మెంట్ అయిందంటే సగం పెళ్లయిపోయినట్లే! నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Sirish)కు హైదరాబాద్‌కు చెందిన నయనికతో నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం నాడు ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. శిరీష్-నయనికల ఎంగేజ్‌మెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి.
వరుణ్- లావణ్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
అయితే నయనిక ఎవరు? ఇది పెద్దలు కుదర్చిన సంబంధమా? లేక లవ్‌లో పడ్డారా? ఈ ప్రేమకహానీ ఎప్పుడు మొదలైంది? అని అభిమానులు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్ పెడుతూ నయనికతో పరిచయం- ప్రేమ గురించి ఓపెనయ్యాడు శిరీష్. నవంబర్ 1న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌లో వారితో కలిసిన దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శిరీష్.

అలా మొదలైంది
వరుణ్, లావణ్యకు రెండో పెళ్లి రోజు శుభాకాంక్షలు. 2023 అక్టోబర్‌లో మీ పెళ్లి జరిగేటప్పుడు హీరో నితిన్- షాలిని దంపతులు మీకోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి షాలిని తన బెస్ట్ ఫ్రెండ్ నయనికను కూడా రమ్మని ఆహ్వానించింది. అలా ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజు రాత్రి తొలిసారి నయనికను చూశాను. అప్పుడే తనను కలుసుకున్నాను.
నా లవ్‌స్టోరీ పిల్లలకు చెప్తా..
కట్ చేస్తే రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఫ్యూచర్‌లో నా పిల్లలు మీరెలా కలుసుకున్నారు నాన్న? అని అడిగితే ఇదిగో, ఇలా మీ అమ్మను కలిశా.. అని ఈ కహానీ అంతా చెప్తాను. నయనిక స్నేహితులకు కూడా పెద్ద థాంక్స్. మీ సర్కిల్‌లో నన్ను కలుపుకున్నందుకు, ఎంతో బాగా చూసుకున్నందుకు థాంక్స్ అని రాసుకొచ్చాడు. అంటే, వరుణ్-లావణ్యల మ్యారేజ్ సమయంలోనే శిరీష్ పెళ్లికి పునాది పడిందన్నమాట! నితిన్ భార్య ఇచ్చిన పార్టీతోనే శిరీష్‌కు లైఫ్ పార్ట్‌నర్ దొరికింది.
చదవండి: షో ఇమేజ్ ఏం కాను? నాగ్ ఉగ్రరూపం.. మోకాళ్లపై కూర్చుని పవన్ వేడుకోలు


