‘ఎంసీఏ’ అంటే కొత్త అర్థం చెప్పిన మెగాహీరో! | Allu Sirish Tweet On Chiranjeevi Birthday Occasion | Sakshi
Sakshi News home page

Aug 23 2018 8:48 PM | Updated on Aug 23 2018 8:49 PM

Allu Sirish Tweet On Chiranjeevi Birthday Occasion - Sakshi

నేను కూడా కోట్లలో ఒక్కడినే.. నేనెప్పుడూ గర్వ పడుతుంటా..

ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ కాదు. మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అయితే అంతకంటే కాదు. ఎంసీఏ అంటే అల్లువారబ్బాయి అల్లు శిరీష్‌ కొత్త అర్థాన్ని చెప్పారు. బుధవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు చిరుని కలిసేందుకు క్యూ కట్టారు. ఇలానే ఈ యువ హీరో కూడా చిరుతో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. 

చిరుతో దిగిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘చివరగా నేను నా సిగ్గును జయించి.. మా మామయ్యను ఓ సెల్ఫీ అడిగాను. నేను కూడా కోట్లలో ఒక్కడినే.. నేనెప్పుడూ గర్వ పడుతుంటా.. ఎంసీఏ (మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని)ని అయినందుకు’ అంటూ పోస్ట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement