Director Rakesh Sashi: అదే నాకు అతి పెద్ద ప్రశంస: ‘ఊర్వశీవో రాక్షసివో’ డైరెక్టర్‌

Director Rakesh Sashi Talks in Press Meet Over Urvasivo Rakshasivo Promotion - Sakshi

‘‘ఊర్వశివో.. రాక్షసివో’ చిత్రం వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ సినిమా ప్రివ్యూ అయిన తర్వాత శిరీష్‌గారు, ‘తెరపై నేను కనపడలేదు.. నేను చేసిన శ్రీకుమార్‌ పాత్ర మాత్రమే కనిపించింది.. థ్యాంక్స్‌’ అన్నారు.. అదే నాకు అతి పెద్ద ప్రశంస. ఆ తర్వాత అల్లు అరవింద్‌గారు కూడా హీరో క్యారెక్టర్‌ అద్భుతంగా ఉందన్నారు’’ అని దర్శకుడు రాకేష్‌ శశి అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం. నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రాకేష్‌ శశి మాట్లాడుతూ.. ‘‘జతకలిసే, విజేత’ చిత్రాల తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ చేశాను.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

‘విజేత’ చూసి, అల్లు అరవింద్‌గారు నన్ను పిలిపించి, శిరీష్‌ కోసం కథ సిద్ధం చేయమన్నారు. ఆ తర్వాత శిరీష్‌గారితో ప్రయాణం చేసి ‘ఊర్వశివో.. రాక్షసివో’ కథని రెడీ చేశాను. షూటింగ్‌ ప్రారంభిద్దాం అనుకున్న సమయంలో లాక్‌డౌన్‌ రావడంతో ఆలస్యం అయింది. ఇప్పటివరకూ శిరీష్‌గారు చేయని సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేశారు. ఆయన కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్‌ మణిరత్నంగారంటే నాకు ఇష్టం. ఆయనలా నాకు సినిమాలు తీయాలని ఉంది’’ అన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top