Allu Sirish Marriage News | Sai Dharam Tej Comments On Allu Sirish Marriage - Sakshi
Sakshi News home page

మెగా ఫ్యామిలిలో త్వరలోనే పెళ్లి బాజాలు

Dec 16 2020 2:23 PM | Updated on Dec 17 2020 10:52 AM

Sai Dharam Tej: Allu Sirish Will Be Getting Married Next Year - Sakshi

మెగా బ్రదర్‌ నాగాబాబు ముద్దుల కుమార్తె నిహారిక వివాహం ఇటీవల వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 9న ఉదయ్‌పూర్‌ వేదికగా జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. ఇక మెగా కుటుంబంలో పెళ్లి సందడి జరిగి వారం తిరగకముందే మరో శుభవార్త టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మెగా ఫ్యామిలిలో త్వరలోనే మళ్లీ పెళ్లి బాజాలు మోగనునట్లు దీని సారాంశం. పెళ్లి విషయంలో అయితే చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో సాయి ధరమ్‌ పెళ్లి ఖాయం అయ్యిందని అప్పట్లో సోషల్‌ మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఈ హీరో కుండబద్దలు కొట్టాడు. అంతేగాక పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. చదవండి:  ఐమ్యాక్స్‌లో మెగా హీరో

దీంతో ఈ పెళ్లి వార్త ప్రస్తుతం అల్లు శిరీష్‌పైకి మళ్లింది. త్వరలోనే శిరీష్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ వెల్లడించారు. తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా ప్రమోషన్‌లో ఇటీవల తేజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘శిరీష్‌ నాకంటే పెద్దవాడు. వచ్చే ఏడాది తన పెళ్లి జరగవచ్చు. నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలి’. అని తెలిపారు. ఇక ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు సంబరంలో మునిగితేలుతున్నారు. త్వరలోనే ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు కొణిదెల కుటుంబంలో మరో పెద్ద పండగ రాబోతుందని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పెళ్లెప్పుడు బాబాయ్‌ : అల్లు అయాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement