అల్లు శిరీష్‌ బడ్డీ మూవీ.. గుడ్ న్యూస్‌ చెప్పిన మేకర్స్! | Allu Sirish latest Movie Buddy Ticket Price Reduced | Sakshi
Sakshi News home page

Allu Sirish: అల్లు శిరీష్‌ బడ్డీ మూవీ.. టికెట్‌ ధరలు ఎంత తగ్గించారంటే?

Jul 29 2024 8:07 PM | Updated on Jul 29 2024 8:19 PM

Allu Sirish latest Movie Buddy Ticket Price Reduced

అల్లు శిరీష్ హీరోగా, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రానికి శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను అడ్వెంచర్‌ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న బడ్డీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో బడ్డీ మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.99, మల్టీప్లెక్సుల్లో కేవలం రూ.125 గా నిర్ణయించినట్లు అల్లు శిరీష్‌ ట్వీట్ చేశారు. కుటుంబమంతా బడ్డీని చూసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే బడ్డీ ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా.. ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా.. బడ్డీ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement